● స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. పట్టణంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు గురువారం ఆయన స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులకు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం వెయ్యి రోజుల పాలన సందర్భంగా బాణసంచా కాల్చారు. పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్‌పర్సన్ నేతావత్ షీభారాణి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, నాయకులు నరుకుడు వెంకటయ్య, కమ్మగోని ప్రభాకర్, ఈగ దామోదర్, పోశాల వెంకన్న, ఎద్దు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


