పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

ఖిలా వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2026–2027 సీజన్‌కు సంబంధించిన పత్తి కొనుగోళ్లకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్‌ మిల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్‌ ప్రకటన ఇచ్చే వారు. ఈ సీజనల్‌లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్‌ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చేతికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది

7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు..

ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి సాగు సుమారు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ.. పత్తిలో గింజలు తీసి బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్తుంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గత ఏడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనల్‌లో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ

16 మార్కెట్‌ యార్డుల పరిధిలో

19 కేంద్రాలు ఏర్పాటు

50.25 లక్షల క్వింటాళ్ల

పత్తి వస్తుందని అధికారుల అంచనా

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 16 మార్కెట్‌ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములుగు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్‌, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ,బీ, ఘన్‌పూర్‌, ఆత్మకూరు, రాంపూర్‌, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్‌–ఏ,బీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఈసారి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రాల వారీగా కొనుగోలు చేసే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్‌ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనాలు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్‌ శాఽఖ అధికారులు తెలిపారు.

పత్తిని బేళ్లుగా మార్చేందుకు

జిన్నింగ్‌ మిల్లులు అద్దెకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement