కాళోజీ సెంటర్: జిల్లాలోని పాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జి ల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి, కా ర్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భ ంగా కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాల ప రిదిలో పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణం చేపట్టి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడే ఉత్తమ ప్రాజెక్టులను గుర్తించి, వాటి అమలుకు అవసరమై న కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎం.నీరజ, పలు శాఖల అధికారులు పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్‌తోనే ఫైళ ్ల క్లియరెన్స్
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో కలెక్టర్ సత్యశారద కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖకు సంబంధించిన ఫైళ్లు ఇకపై అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ద్వారానే పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ ఫైళ్ల ప్రక్రియను తక్షణమే అదనపు కలెక్టర్ ద్వారానే నిర్వహించాలని పేర్కొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


