నర్సంపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ అన్నారు. నర్సంపేట పట్టణంలో బుధవారం వైఎస్సార్ 17వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సుపరిపాలన అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల సాంబరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్‌గుప్తా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి కిరణ్‌గౌడ్, నర్సంపేట సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్లు ముత్తినేని వెంకన్న, బీరం భరత్‌రెడ్డి, ఏపూరి శ్రీనివాస్‌రెడ్డి, బాణాల ప్రసన్నశ్రీనివాస్, శ్రీరామోజు రోజారాణి, పొన్నాల మనీషాప్రకాష్, ఇస్లావత్ రమాగోపినాయక్, చీకటి స్వరూపఓదెలుగౌడ్, సలావుద్దీన్, అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు.
టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్


