నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

హన్మకొండ: వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వాహకులు పోలీస్‌, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ ప్రజలు, ఉత్సవ కమిటీలు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ సమీప ప్రాంతాల్లో నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్న మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుతే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126 85048 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీసీపీలు దార కవిత, అంకిత్‌కుమార్‌, రాజమహేంద్ర నాయక్‌, జనగామ అదనపు కలెక్టర్‌ బెన్‌ షా లోం, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement