108 సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

108 సేవలు వినియోగించుకోవాలి

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

జిల్లా మేనేజర్‌ మండ శ్రీనివాస్‌

దామెర: ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని జిల్లా మేనేజర్‌ మండ శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో 108 వాహనాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిజిస్టర్‌, వాహన కండీషన్‌, పరికరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు 704 ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. ఆపద సమయంలో 108 నంబర్‌కు కాల్‌చేసి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మహేంద్ర, 108 మెడికల్‌ టెక్నీషియన్‌ బంక శ్రీనివాస్‌, ఎల్‌.సురేశ్‌, పైలట్స్‌ వి.మహేందర్‌, టి.సాంబమూర్తి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement