● మంత్రి పొన్నం ప్రభాకర్
● అంతర్గత సీసీ రోడ్డు ప్రారంభం
వేలేరు: కన్నారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలంలోని కన్నారంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కన్నారం గ్రామానికి సాగునీరందించేందుకు దేవాదుల నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. హుస్నాబాద్ నుంచి కన్నారానికి, హనుమకొండ నుంచి కన్నారం వరకు అవసరమైన బస్సు సర్వీసులపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రూ.25 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నె రవీందర్, అధికారులు పాల్గొన్నారు.


