● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్
● రేపు పరకాలలో అమరవీరుల
సంస్మరణ సభ
పరకాల: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల సేవలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్ అన్నారు. పరకాలలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పరకాల అమరధామంలో ఈనెల 2న జరిగే సంస్మరణ సభపై బీజేపీ శ్రేణులతో చర్చించారు. సంతోశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈసభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హాజరుకానున్నుట్లు తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ జయంత్‌లాల్, దేవునూరి మేఘనాథ్, కౌన్సిలర్ కుక్కల విజయ్‌కుమార్, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కాచం గురుప్రసాద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పైండ్ల రంజిత్, పట్టణ కార్యదర్శి దంచనాదుల కిరణ్, నాయకులు దంచనాదుల సత్యణారాయణ, కానుగుల గోపీనాథ్, మెంతుల సురేశ్ పాల్గొన్నారు.


