అపార్ ఉపయోగాలు..
విద్యార్థుల భవిష్యత్‌కు తప్పనిసరిగా అపార్ కార్డు
కాళోజీ సెంటర్: విద్యార్థి విద్యాప్రస్థానం ఒకే డిజి టల్ ప్లాట్‌ఫాం కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అపార్ ఐడీ నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ప్రతి విద్యార్థికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఆదేశించింది. అపార్ ఐడీ కేటాయింపులో ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని, 100 శాతం నమోదు పూర్తి చేయాలని డీఈఓ సూచించారు. జిల్లాలో 872 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. యూడైస్ ప్రకారం 1,27,149 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
విద్యార్థుల డేటాను ఏకీకృతం చేసేందుకు..
దేశవ్యాప్తంగా విద్యార్థుల డేటాను ఏకీకృతం చేసేందుకు కేంద్రం అపార్‌ను ప్రవేశపెట్టింది. డిజిటల్ లాకర్ పద్ధతిన ఆరో తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు మార్కులు, గ్రేడ్లు, స్కాలర్‌షిప్‌లు, క్రీడా ప్రావీణ్య పత్రాలన్నీ ఒకే చోట భద్రపరిచేందుకు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ప్రక్రియ ప్రారంభించింది.
నమోదు ప్రక్రియ ఇలా..
ఆధార్‌కార్డు, తల్లిదండ్రుల సమ్మతి అవసరం. డీజిలాకర్ లేదా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) పోర్టల్ ద్వారా ఉచిత సేవలు పొందవచ్చు. పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులందరికీ ఐడీ జనరేట్ అయ్యేలా బాధ్యత తీసుకోవాలి. ప్రతి విద్యార్థి ప్రొఫైల్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ద్వారా 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 12 అంకెల గల అపార్ ఐడీ సిద్ధం చేస్తే ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ పొందడానికి సులువు అవుతుంది.
పాఠశాలలు విద్యార్థులు ఐడీ పొందిన
విద్యార్థులు
ప్రభుత్వ 593 46,048 31,185
ప్రైవేట్ 279 81,101 51,508
మొత్తం 872 1,27,149 82,693
సులువైన అడ్మిషన్లు, ఒక పాఠశాల, కళాశాల నుంచి మరోదానికి మారినప్పుడు ఫిజికల్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ శ్రమ తగ్గుతుంది. నకిలీలకు, దొంగ సర్టిఫికెట్లతో సాగే అక్రమాలకు చెక్‌పెట్టవచ్చు. స్కాలర్‌షిప్‌లు, విద్యార్థి అర్హతను సులభంగా నిర్ధారించి సంక్షేమ పథకాలు వేగంగా అందించవచ్చు.
వన్ నేషన్–వన్ స్టూడెంట్ కింద
12 అంకెల ప్రత్యేక గుర్తింపు
జిల్లాలో 100 శాతం నమోదుకు
విద్యాశాఖ ఆదేశాలు


