న్యూశాయంపేట: భద్రకాళి చెరువు వరద నివారణ పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చెరువు నీటి ప్రవాహం, వరద పరిస్థితులు, కాల్వలు, నీటి విడుదల మార్గాలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఇరిగేషన్ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్, డీఈ మధుసూదన్‌రెడ్డి, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి
కాళోజీ సెంటర్: సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఆర్‌ఓ విజయలక్ష్మితో కలిసి కొత్త పింఛన్ల పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్, పెన్షన్ డీపీఎం రేవతి పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష


