హామీ నెరవేర్చాలి.. | - | Sakshi
Sakshi News home page

హామీ నెరవేర్చాలి..

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

హామీ నెరవేర్చాలి.. పేస్కేల్‌ వర్తింపజేయాలి

పేస్కేల్‌ విషయంలో మంత్రి సీతక్క గతంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు. సిబ్బంది దీర్ఘకాలిక సమస్యను ఇకపై వాయిదా వేయకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేస్కేల్‌ విధానాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి.

– తిరుమలదేవి,

కంప్యూటర్‌ ఆపరేటర్‌, నల్లబెల్లి

ప్రభుత్వ హామీ అమలు కోసం ఎదురుచూస్తున్నాం. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం చాలీచాలని వేతనాలు అందిస్తోంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. జిల్లాలో 78 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరికీ పేస్కేల్‌ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– జాకబ్‌, జేఏసీ జిల్లా చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement