దుగ్గొండి: మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన పీరాల భగవత్ ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భగవత్ బాల్య మిత్రులు 14 మంది కలిసి భగవత్ పేరిట తొగర్రాయి స్టేజీ వద్ద బస్టాప్ నిర్మించారు. దీనిని శుక్రవారం ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి, సర్పంచ్ రాస రమతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్సై మాట్లాడారు. మిత్రుడి గుర్తుగా బస్టాప్ నిర్మించడం అభినందనీయమన్నారు. మిత్రులు కస్తూరి అరవింద్ పటేల్, బల్దు అశోక్, అమ్మ హరీశ్, ఇజ్జగిరి మధుకర్, బుసాని నరేందర్, చీర్ల నరేశ్‌రెడ్డి, బుసాని నవీన్‌రాజ్, మేకిరి పృథ్వీరాజ్, ఎలగొండ రాజేందర్, బొబ్బాల రాజేశ్‌రెడ్డి, చెల్పూరి రాజేశ్, తుమ్మలపల్లి రంజిత్, కంతిరి సతీశ్, లింగదారి శ్రీకాంత్, భగవత్ తండ్రి పీరాల మల్లయ్య, రవి, ఉప సర్పంచ్ బుసాని రాజు, మాజీ సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి, తుమ్మలపల్లి మహేందర్, అమ్మ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


