శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

– 9లోu

న్యూస్‌రీల్‌

రాఖీ కానుకగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

చెల్లెలి కుటుంబానికి బాండ్‌ అందించిన అన్న

వేలేరు : సాధారణంగా రాఖీ పండుగకు చెల్లెలికి బహుమతులు, నగదు అందించడం ఆనవాయితీ. కానీ, తనకు రాఖీ కట్టిన చెల్లికి ఓ అన్న.. వినూత్న కానుక ఇచ్చారు. చెల్లి కుటుంబానికి మొత్తం ఆరోగ్య బీమా చేయించి బాండ్‌ అందించాడు. వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన జక్కుల సంపత్‌ తన చెల్లెలి కుటుంబానికి ఆరోగ్య భద్రతే ముఖ్యమని భావించి గత నాలుగేళ్లుగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని రాఖీ కానుకగా అందజేస్తున్నారు. శుక్రవారం కూడా తనకు రాఖీ కట్టిన చెల్లెలు బేతి మౌనిక కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల విలువ గల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ చేసి అందించారు. ఈ సందర్భంగా జక్కుల సంపత్‌ మాట్లాడుతూ.. తన చెల్లెలు, బావతోపాటు కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్యఖర్చుల విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతీ సంవత్సరం రాఖీ పండుగ రోజున హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ చేయిస్తున్నట్లు తెలిపారు. అన్న ఇచ్చిన రాఖీ కానుక తమకు ఎంతో విలువైనదని చెల్లెలు మౌనిక పేర్కొంది.

రాఖీతో ప్రేమ.. హెల్మెట్‌తో భద్రత

సోదరులకు కానుకగా ఇచ్చిన సోదరి

భీమదేవరపల్లి : రాఖీ పౌర్ణమి వేళ ఓ సోదరి తన అనుబంధాన్ని చాటడంతోపాటు సమాజానికి ఆదర్శంగా నిలిచే సందేశాన్ని ఇచ్చారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ గ్రామానికి చెందిన దిడ్డి విజయ శుక్రవారం తన సోదరులు గౌడ బాలాజీ, గౌడ చంద్రబాబులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ హెల్మెట్లను కానుకగా అందించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ తన సోదరులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. రాఖీ పండుగ కేవలం అనుబంధాలకే కాకుండా పరస్పర బాధ్యతను తెలియజేస్తుందని, సోదరుల రక్షణే అక్కాచెల్లెళ్లకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భద్రతా సందేశాన్ని చాటిన సోదరి విజయ ఆలోచనను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement