హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసి అమ్మవారి ఉత్సవమూర్తులను ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తా, కులసుందరి (రూపం) క్రమంలో అమ్మవారికి పూజలు చేశారు. షోడశీ క్రమాన్ని అనుసరించి భద్రకాళి మాతను జ్ఞానశక్తి కుల సుందరీదేవీగా అలంకరించగా.. ఆలయ పూజారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు జ్ఞానశక్తి కులసుందరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఈఓ రాముల సునీత తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పాల్గొన్నారు.
వ్యవసాయ బావిలో మొసలి
ఖానాపురం: మంగళవారిపేటలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆబోతు కుమార్‌కు చెరువు సమీపంలో వ్యవసాయ బావి ఉంది. అందులో మొసలి ఉండడంతో స్థానికులు, రైతు కుమార్ స్థానిక సర్పంచ్ గొంది సుజాతనాగేశ్వర్‌రావుకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో నరేశ్‌ను వివరణ కోరగా బావిలో మొసలి ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. బావిలో నీటిని తొలగించి శుక్రవారం ఉదయం రెస్క్యూ టీం సహకారంతో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
చెన్నారావుపేటలోజాతీయ బృందం
చెన్నారావుపేట: ఆశాజ్యోతి మండల సమాఖ్యను నేషన్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ రిసోర్స్ పర్సన్ల బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మహ్మద్ హుస్సేన్, గిరీష్ ప్రధాన్ మహిళలు భవిష్యత్‌లో తీసుకోనున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. మండల సమాఖ్యలతో ఏర్పాటు చేసిన వివిధ కమిటీల వివరాలు, అవి పనిచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఖాదర్‌పేట గ్రామంలోని గ్రామైక్య సంఘం సమావేశానికి హాజరయ్యారు. గ్రామస్థాయిలో వారి పనితీరును తెలుసుకున్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, సెర్ప్, ఐబీ అధికారి స్వర్ణలత, డీపీఎం అనిల్‌కుమార్, రాజ్‌కుమార్, ఏపీఎం తిలక్, ప్రతినిధులు వెంకటలక్ష్మీ, భాగ్యలక్ష్మి, కవిత, సీసీలు కట్టయ్య, మాణిక్యం, బాబు, సుజాత, మంజుల, సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: వరంగల్ తూర్పులోని ప్రతీ బూత్‌లో బీఎల్‌ఓతో బూత్ ఇన్‌చార్జ్‌లు కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ అహ్మద్ నసీర్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్ల కాంగ్రెస్ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్‌రాజు, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు చివరి తేదీ కావడంతో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన ప్రతీ పోలింగ్ బూత్‌లో జరుగుతున్న తీరును డివిజన్ ఇన్‌చార్జ్‌లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 24 డివిజన్ల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


