అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంగారు నగల కొనుగోలుదారుడికి రెండు విధాలా నష్టం జరిగే అవకాశం ఉంది. హాల్‌మార్క్ లేని లేదా నాణ్యతా ప్రమాణాలు లేని బంగారం కొనడం, టెస్టింగ్ సెంటర్ నివేదికల్లో వాస్తవానికి మించి నాణ్యత చూపించే అవకాశం ఉంటే, వినియోగదారుడు తప్పుడు ధ్రువీకరణ ఆధారంగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. లీగల్ మెట్రాలజీ విభాగానికి పర్యవేక్షణ అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడంతోనే ఈ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికై నా దృష్టి సారించాలి.
– సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి
●


