ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఉమారెడ్డి
దామెర: రైతులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆర్.ఉమారెడ్డి అన్నారు. వరంగల్ వ్యవసాయ కళాశాల ఆధర్యంలో మండలంలోని పులుకుర్తిలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అధునాతన పద్ధతులతో సులభతర వ్యవసాయం చేయాలన్నారు. సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించి చీడ పీడలను నివారించుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ వి.రవీంద్రనాయక్, టీఆర్‌వీకే కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అఽధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ గోపిక, ఏఓ అల్లె రాకేశ్, ఏఈఓ రామకృష్ణ, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


