మేడారంలో తగ్గని రద్దీ | - | Sakshi
Sakshi News home page

మేడారంలో తగ్గని రద్దీ

Feb 2 2026 7:07 AM | Updated on Feb 2 2026 7:07 AM

మేడార

మేడారంలో తగ్గని రద్దీ

గద్దెల ప్రాంగణంలో సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటున్న భక్తులు – వివరాలు IIలోu

మహాజాతర ముగిసినా తరలివచ్చిన భక్తజనం

కిక్కిరిసిన సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం

మంత్రి పొన్నం ప్రభాకర్‌

తెలంగాణకు కేంద్రం మొండిచేయి

నర్సంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆయుబ్‌, అశోక్‌గౌడ్‌లతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది కేంద్రం తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు శాసనసభ వేదికగా కేంద్రాన్ని నిలదీశామన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయినా వివక్ష చూపిస్తున్నారన్నారు. కుంభమేళ లాంటి మేడారం జాతరకు మోదీ ఎందుకు రాలేదన్నారు. జాతరలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పని చేశాయన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు మున్సిపాలిటీలకు మున్సిపల్‌ ఎన్నికల సమన్వయ కర్తగా రావడం జరిగిందన్నారు. అన్నీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌, తదితరులు పాల్గొన్నారు.

మేడారంలో తగ్గని రద్దీ 1
1/1

మేడారంలో తగ్గని రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement