రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది..
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి: రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసుల పేరుతో బెదిరిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ మండలపార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్ నోటీసుల పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా కార్యకర్తలతో ధర్నా, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల ప్రధానకార్యదర్శి పూస మధు, రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, కర్ర రవీందర్‌రెడ్డి, భూక్య క్రాంతి, గారె నర్సయ్య, ఐత రాంచందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


