మద్దిమేడారం జాతర ఆదాయం రూ.3.43లక్షలు | - | Sakshi
Sakshi News home page

మద్దిమేడారం జాతర ఆదాయం రూ.3.43లక్షలు

Feb 2 2026 7:07 AM | Updated on Feb 2 2026 7:07 AM

మద్దిమేడారం జాతర ఆదాయం రూ.3.43లక్షలు

మద్దిమేడారం జాతర ఆదాయం రూ.3.43లక్షలు

నల్లబెల్లి: నాగరాజుపల్లి మద్దిమేడారం సమక్క–సారలమ్మ జాతర ముగియడంతో ఆలయ కమిటీ చై ర్మన్‌ పబ్బు రాజేష్‌ పర్యవేక్షణలో అధికారులు ఆది వారం హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలో ఇన్‌చార్జ్‌ ఈఓ సత్యనారాయణ, ఎస్సై గోవర్ధన్‌ నేతృత్వంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా హుండీల ద్వారా రూ.1,78,190 నగదుతో పాటు నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. దుకాణాల వేలం ద్వారా రూ.1.65 లక్షలు వచ్చినట్లు ఈఓ తెలిపారు. మొ త్తంగా జాతర ఆదాయం రూ.3,43,190 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పబ్బు రాజేష్‌, పూజారి దురిశెట్టి నాగరాజు, సర్పంచ్‌లు లలిత రఘు, సరోజన సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement