
ముగిసిన పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షలు
హన్మకొండ కల్చలర్: విద్యార్థులకు నిర్వహించిన పేరిణి నాట్య ప్రవేశిక స్థాయి పరీక్షలు ఆదివారం ముగిశాయి. వరంగల్‌లోని నాగార్జున హైస్కూల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 180 మంది విద్యార్థులకు థియరీ, ప్రాయోగిక, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు అకాడమీ నిర్వాహకుడు గజ్జెల రంజిత్‌కుమార్ చీఫ్ ఎగ్జామినర్‌గా, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నాట్య అధ్యాపకురాలు చాతరాజు నవ్యజ ఇంటర్ననల్‌గా, హైదరాబాద్‌కు చెందిన పేరిణి గురువు సందీప్ ఎక్స్‌టర్నల్‌గా విధులు నిర్వర్తించారు.