
నర్సంపేట–నెక్కొండ దారిలో నిలిచిన రాకపోకలు
నర్సంపేట: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. నర్సంపేట–నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారిలో పాతమగ్ధుంపురం వద్ద ఉన్న లో లెవల్ కాజ్‌పై నుంచి వరద నీరు ప్రవహించింది. మండల స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, తహసీల్దార్ అబిద్ అలీ, ఎంపీడీఓ నల్లా శ్రీవాణి, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి, గిర్దావర్ మహ్మద్ రషీద్, పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బందితో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాజ్‌పై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.