
‘రేషన్’కు కొత్త బ్యాగులు
● ఏనుమాముల గోదాంకు చేరిన సంచులు
ఖిలా వరంగల్: జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముద్రించిన కొత్త సంచులు చేరుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధరల దుకాణాల్లో ప్రతికార్డు దారుడికి ఉచితంగా ‘సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని ముద్రించిన బ్యాగులను డీలర్లు పంపిణీ చేయనున్నారు. దీంతో వినియోగదారులు ఇంటినుంచి బ్యాగు తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సంచిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉన్నాయి.
విరబూసిన బ్రహ్మకమలం
గీసుకొండ: మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాదినేని బాలస్వామి ఇంటిలో రెండేళ్ల క్రితం నాటిన బ్రహ్మకమలం మొక్క విరబూసింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడిన శుభ సమయంలో బ్రహ్మకమలం విచ్చుకుని కనువిందు చేయడం విశేషం. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్, బర్మా, టిబెట్ , చైనా, నేపాల్ దేశాల్లో కనిపిస్తుంది. ఇలాంటి అరుదైన మొక్కను రాజమండ్రి నుంచి కొనుగోలు చేసి బాలస్వామి ఇంటి ఆవరణలో నాటగా తాజాగా ఓ పువ్వు పూసింది. ఏడాదికోసారి బ్రహ్మకమలం మొక్క పువ్వు పూస్తుందని, శివుడిని ఆరాధించడానికి ఈ పుష్పాన్ని ఉపయోగిస్తారని ఆయన తెలిపారు.

‘రేషన్’కు కొత్త బ్యాగులు

‘రేషన్’కు కొత్త బ్యాగులు