
పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిక
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: ఇందిరాగాంధీ స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు, 24వ వార్డు ప్రజలతోపాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవరెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయం అన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 24వ వార్డులోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఎమ్మెల్యే సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేదర్, 24వ వార్డు అధ్యక్షుడు కోలా చరణ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య, ఓబీసీ వరంగల్ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, జిల్లా కమిటీ అధ్యక్షురాలు పార్వతమ్మ, మాజీ సర్పంచ్ చిలువేరు రజినీభారతి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, జిల్లా కార్యదర్శి నూనె పద్మ, పట్టణ అధ్యక్షురాలు కీర్తన, పట్టణ ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి తదితరులు పాల్గొన్నారు.