పరకాల: పరకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం పరకాలలో పర్యటించిన ఆయన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు దామెర చెరువు ట్యాంక్‌బండ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టడంతో పాటు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్టేడియంగా మార్చండి..
పరకాలలోని వెల్లంపల్లి రోడ్డులో నిర్మాణం జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పట్టణ ప్రజలకు దూరమవుతున్న దృష్ట్యా స్పోర్ట్స్ స్టేడియంగా మార్చాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అందులోనే ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ తదితర వాటిని ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తగిన నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి