వరంగల్: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జిల్లాస్థాయి యువ ఉత్సవ్–2025ను ఘనంగా నిర్వహించారు. జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముస్తాక్‌అలీ మాట్లాడారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ సాంస్కృతిక పోటీలు దోహదపడుతాయని తెలిపారు. ముఖ్య అతిథి వరంగల్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతిభకు యువకులు తార్కాణంగా నిలుస్తున్నారని, నృత్యం, కవితారచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులతోపాటు ప్రశంసపత్రాలు అందజేశారు. సత్యం కంప్యూటర్స్ చైర్మన్ గంట రవికుమార్, ఫిలిం సెన్సార్ బోర్డు డైరెక్టర్ ఆకుల నాగేశ్వర్, మామునూరు ఇన్‌స్పెక్టర్ రమేశ్, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, కళాశాల అధ్యాపకులు రమేశ్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ మొహమ్మద్ ఆజం, శ్వేత, వలంటీర్లు భరత్, సాయి, శ్రావణి, శివాజీ, శ్రావణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


