● వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి
● మున్సిపల్ కమిషనర్ టి.శేషాంజన్‌స్వామి
పరకాల : మీరు ట్రేడ్ లైసెన్స్ ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు.. మీ దుకాణానికి సంబంధిత ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉందని బెదిరింపు ధోరణిలో ఫోన్‌కాల్స్ రావడంతో పరకాలలో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని కొందరు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 8019987289 నంబర్ నుంచి మున్సిపల్ సిబ్బంది చేయలేదని, నకిలీ వ్యక్తులు చేశారని తేల్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదని తెలిపారు. నకిలీ ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ట్రేడ్ లైసెన్స్ కావాల్సిన వారు సంబంధిత పత్రాలు జతచేసి మున్సిపల్ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి లైసెన్స్ జారీ చేస్తామని తెలిపారు. లేదంటే మున్సిపల్ ఉద్యోగులకు నగదు చెల్లించి రశీదు తీసుకోవాలని ఆయన కోరారు.


