సెల్ఫీ విత్ గణేశ్
శుక్రవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
7
ధార్మిక భవన్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు, సత్యవతి తదితరులు
వరంగల్ : దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భద్రకాళి ఆలయ సమీపంలో రూ.4.16 కోట్లతో నిర్మించిన ధార్మిక భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమీకృత దేవాదాయశాఖ కార్యాలయంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క–సారలమ్మ ఈఓ, ఇంజనీరింగ్ కార్యాలయాలు ఉంటా యని పేర్కొన్నారు. తెలంగాణ మల్టీజోన్ పరిధిలో ని 19 జిల్లాల్లో ఉన్న దేవాలయాలు ధార్మిక భవన్ పరిధిలోకి వస్తాయన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని దేవాలయాలను పర్యవేక్షించే కార్యాలయం హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని వివరించారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందేందుకు ఎంతో శ్రమించామని గుర్తుచేశారు. మాడవీధుల నిర్మాణానికి మంచి ప్లాన్ గీయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నా రు. శిథిలావస్థలో ఉన్న కాకతీయుల ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి, అధికారులను కోరారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని యా దాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని, మాడ వీధులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, కుడా చైర్మన్ ఎస్.సుందర్‌రాజ్, హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్, కమిషనర్ షేక్‌రిజ్వాన్‌బాషా, వరంగల్ జోన్ డీసీ శ్రీకాంతరా వు, ఏసీ సునీత, ఈఈ రమేష్‌బాబు పాల్గొన్నారు.
కల్యాణ మండపం త్వరగా పూర్తయ్యేలా కృషి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయం కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున వారితో చర్చించి త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. గురువారం నగరపర్యటనలో భాగంగా వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయాలను నాయకులతో కలిసి సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆ ముగ్గురి మధ్య పోటీ ఎక్కువ..
వరంగల్ తూర్పు నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ, సామల ప్రదీప్ కుమార్, భవంతుల రాధిక, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, డాక్టర్ కత్తి వెంకటస్వామి, యంబాడి రవీందర్, బారుపాటి రవీందర్‌లు పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. దీనిపై ఇప్పటికే దఫాల వారీగా సర్వేలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం... ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి ఫైనల్ చేసే ప్రయత్నాల్లో ఉంది. దీంతో ఆయా అభ్యర్థులు ఎవరికి వారుగా టికెట్ ఫైనల్ చేసుకునేందుకు తమకు దగ్గరైన ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ, సామల ప్రదీప్ కుమార్ ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్టుగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడం అదనపు బలం కాగా, నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఇటీవల తిరిగి కార్యక్రమాలు ముమ్మరం చేసినా కూడా ప్రజలను మెప్పించే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇంకోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తాను ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నానని, గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఇక్కడి నేతలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయనే వాదనను వినిపిస్తున్నారు. సామల ప్రదీప్ కుమార్ వరంగల్ సిటీలో నాలుగేళ్లుగా సామల జయశంకర్ ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో రోగులకు సలహాలు ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటుచేయడం, ఎంజీఎంలో అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు విరాళంగా ఇవ్వడంతోపాటు అవసరార్థులకు ఆహారాన్ని అందించారు. అమెరికాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసిన సమయంలో అగ్రనేత రాహుల్ గాంధీతో ఏర్పడిన పరిచయం కూడా తనకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇలా తూర్పులో ఈ ముగ్గురి మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరిని టికెట్ వరిస్తుందోనన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత రానుంది. సాధ్యమైనంత తొందరగా టికెట్ ప్రకటిస్తే ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజలను కలుపుకొని పోయే అవకాశం ఉందని ఆశావహులు అంటున్నారు.
రుణాలను వినియోగించుకోవాలి
ఐనవోలు: నందనం సొసైటీ ఆధ్వర్యంలో అంది స్తున్న రుణాలను కర్షకులకు వినియోగించుకో వా లని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు సూచించారు. నందనం రైతు సేవా సహకార సంఘం ద్వారా కర్షకమిత్ర మార్టిగేజ్ లోన్లను గురువారం ఐదుగురు రైతులకు అందజేసి, మాట్లాడారు. బ్యాంకు ద్వారా పంట, బంగారం తనఖా రుణాలతో పా టు వ్యవసాయ భూమి మార్టిగేజ్ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్‌రీల్
నరేందర్ అభ్యర్థిత్వం మార్చండి!
లేకుంటే పార్టీ మారుతాం
తూర్పు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో
విసిగిపోయాం
13 మంది కార్పొరేటర్ల
రహస్య మంతనాలు
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం?
ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి
ఇంద్రకరణ్‌రెడ్డి
రూ.4.16 కోట్లతో నిర్మించిన
ధార్మిక భవన్ ప్రారంభం
ఆధ్యాత్మికతకు పెద్దపీట


