పాన్‌గల్/వీపనగండ్ల/చిన్నంబావి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో సంక్షేమ పథకాల కోసం పేదలు ఎదురుచూసే వారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల అవసరాలను గుర్తించి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. వృథా ఖర్చులు చేయకుండా పిల్లలను మంచిగా చదివించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ నెల 19న ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు చేయనుందని.. ధనిక, పేద తేడాలేకుండా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఇంటి యజమాని పేరిట రూ.5 లక్షల ఉచిత బీమా చేయనుందన్నారు. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు బీమా వరిస్తుందని వివరించారు. పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి ప్రాంతాల్లో భీమా నుంచి నీటి లభ్యత తక్కువగా ఉందని, అందువల్ల సింగోటం నుంచి గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. శ్రీరంగాపురం రిజర్వాయర్ కాల్వ వెడల్పు తక్కువగా ఉండటంతో నీరు నింపలేకపోతున్నామని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 70 వేల పైచిలుకు పింఛన్‌దారులు ఉన్నారని, వారికి ప్రతి నెల రూ.17 కోట్లు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. చిన్నంబావి మండలంలో రూ.కోట్ల బీటీ రహదారులు, మండలకేంద్రంలో రూ.నాలుగు కోట్లతో అన్ని హంగులతో పార్కు నిర్మాణం, రూ.2 కోట్లతో సమీకృత ప్రభుత్వ కార్యాలయ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాలూరులో మత్స్యకారులకు మంజూరైన బైక్‌లను లబ్ధిదారులకు అందించారు. పాన్‌గల్‌లో జరిగిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, డీపీఆర్వో సీతారాంనాయక్, తహసీల్దార్ కార్తీక్‌రావు, ఎంపీడీఓ గోవిందరావు, సర్పంచ్ నాగలక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, భాస్కర్‌యాదవ్, పుల్లారావు, ఉస్మాన్, బాలరాజుయాదవ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు హేమాద్రినాయుడు, వెంకటయ్యయాదవ్, ప్రేమ్‌నాయక్, కరాటే గోపాల్, చిన్నంబావిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఒ ఆదర్శ్‌గౌడు, సింగిల్‌విండో చైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి, విద్యాసాగర్‌రావు, సర్పంచ్‌లు బిచ్చన్న, భాస్కర్, ఆంజనేయులు యాదవ్, కవిత, ప్రమీలమ్మ, ఇటిక్యాల పెంటమ్మ, వీపనగండ్లలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, ఎంపీడీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


