ఖిల్లాఘనపురం: మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జంగం సాయిసాత్విక్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. డిసెంబర్ 14న మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రం తరుఫున విద్యార్థి పాల్గొంటారని మండల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి యాదయ్య, దేవేందర్ తెలిపారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న విద్యార్థిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందిమళ్ల శ్రీకాంత్, మండల అసోసియేషన్ సభ్యులు యాదయ్య, దేవేందర్, సర్పంచ్ నాగయ్య, పెద్దలు కృష్ణయ్య, కొరిగెల గోపి అభినందించారు.


