ఆత్మకూర్: చట్టం దృష్టిలో అందరూ సమానమేనని.. న్యాయసేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శిరీష కోరారు. అంతర్జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, ప్రధానకార్యదర్శి ముక్తేశ్వర్, ఉపాధ్యక్షుడు దివాన్జీ అశోక్‌రావు ఆధ్వర్యంలో కోర్టు నుంచి పురవీధుల మీదుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్‌లో చట్టాలు, న్యాయసేవలపై స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తిప్పారెడ్డి, నారాయణగౌడ్, రామేశ్వర్‌రెడ్డి, శంకర్‌లింగం, అశోక్‌గౌడ్, రాంచందర్, అబ్రహం, వినోద్, కోర్టు సూపరింటెండెంట్ అయ్యపురెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది స్వప్న, విద్యావతి, రాజ్యలక్ష్మి, లక్ష్మణ్, ఖాజపాషా, అంజద్, కోర్టు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు 1,200
క్యూసెక్కుల వరద
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం ఎగువ నుంచి 1,200 క్యూసెక్కుల వరద చేరుతుందని ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి వరద పూర్తిగా నిలిచిపోగా.. ఆయకట్టు పరిధిలోని పంట పొలాల నుంచి దిగువకు వస్తున్న నీరు జలాశయానికి చేరడంతో ప్రవాహం మొదలైందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 1.961 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉందని.. ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వలతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి తరలింపును నిలిపివేసినట్లు వివరించారు.
పత్తి క్వింటా రూ.9,049
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. యార్డుకు 926 బ స్తాల పత్తి రాగా క్వింటా గరిష్టంగా రూ.9,049, కనిష్టంగా రూ.8,589 ధరలు లభించాయి. అదేవిధంగా 10,398 బస్తాల ధాన్యం రాగా క్వింటా గరిష్టంగా రూ.3,859, కనిష్టంగా రూ.2,389, మొక్కజొన్న 3354 బస్తాలు రాగా గరిష్టంగా రూ.3,213, కనిష్టంగా రూ.2,739, వేరుశనగ గరిష్టంగా రూ.8,571, కనిష్టంగా రూ.5,726 ధరలు లభించాయి.


