ఆ ఉపాధ్యాయుడి రూటే సపరేటు.. | - | Sakshi
Sakshi News home page

ఆ ఉపాధ్యాయుడి రూటే సపరేటు..

Sep 5 2026 12:50 AM | Updated on Sep 5 2026 12:50 AM

అమరచింత: ఆత్మకూర్‌కు చెందిన సంతోష్‌కుమార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన నాటి నుంచి సాంకేతికతపై పట్టు సాధించారు. తన పాఠశాల విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలనే దృఢ సంకల్పంతో సాంకేతికతను ముందస్తుగా నేర్చుకుంటూ తరగతి గదిలో విద్యార్థులకు డిజిటల్‌ బోధన చేస్తున్నారు. ఓ గదిని ఆంగ్ల అక్షరాలతో పాటు ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆంగ్లంలో మెళకువలు నేర్పిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. 1996 నుంచి విద్యార్థులకు కంప్యూటర్‌ ద్వారా ఆంగ్ల పదాలు నేర్పించే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతంలో జిల్లాలో విధులు నిర్వర్తించిన కలెక్టర్లు సైతం ఆయనను సత్కరించారు. ఆయన ఉమ్మడి ఆత్మకూర్‌ మండలంలో 31 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement