ఉపాధి పొందుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పొందుతున్నా..

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

ఉపాధి పొందుతున్నా.. నెలవారీ వేతనాలు.. నెలకు రెండు చీరలు.. చేనేత అంతరించకుండా..

గతంలో మాస్టర్‌ వీవర్స్‌పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. తర్వాత సంఘంలో సభ్యత్వం పొందడంతో మగ్గం, ముడి సరుకు అందించారు. తయారు చేసిన చీరలకు మాస్టర్‌ వీవర్స్‌ కంటే అధికంగా వేతనం చెల్లిస్తున్నారు. ఐదేళ్లుగా నెలకు రెండు జరి చీరలు తయారు చేస్తూ రూ.10 వేల వేతనం పొందుతున్నా. – మహంకాళి బాలస్వామి,

నేత కార్మికుడు, అమరచింత

అప్పట్లో మాస్టర్‌ వీవర్స్‌తో అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. వాటిని విక్రయించాక తిరిగి డబ్బులు చెల్లించేవాళ్లం. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారి వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఖర్చులు తీరుతున్నాయి. – పుట్టా శ్రీనివాసులు,

నేత కార్మికుడు, అమరచింత

గతేడాది చేనేత ఉత్పత్తుల సంఘంలో సభ్యుడిగా చేరా. నెలకు రెండు చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో చేనేత కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్రస్తుతం సంఘం అన్నీ భరిస్తూ ముడిసరుకు ఇవ్వడంతో పాటు వేతనం చెల్లించడం, లాభాల్లో వాటా పంచుతోంది. దీంతో కార్మికుడిగా కాకుండా యజమాని అనే ఆలోచనతో మగ్గాలపై చీరలు తయారు చేస్తున్నాం.

– ఎం.లక్ష్మణ్‌, నేత కార్మికుడు, అమరచింత

పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. చేనేతను కాపాడాలని, కార్మికులను యజమానులు చేయాలనుకొని నాబార్డు బృందంతో సంప్రదించి సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు చేశా. కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంఘం ఏర్పాటు చేశా. 20 మందితో ప్రారంభించి నేడు 550 కార్మికుల భాగస్వామయ్యంతో సంఘం కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు ప్రతినెల వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం కంపేనీకి 11 ఎలక్ట్రికల్‌ జకాటీ మగ్గాలు వచ్చాయి. వీటితో కొత్త డిజైన్లతో పాటు చీరల తయారీ పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.

– మహంకాళి శేఖర్‌, సీఈఓ, అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement