వనపర్తి: జిల్లాకేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు, సమస్యలను వివరిస్తూ ఈ నెల 3న సోమవారం ‘ప్రజారోగ్యంపై పట్టింపేది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు (25), అసోసియేట్ ప్రొఫెసర్లు (43), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (29), ట్యూటర్ (30) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన, 33 మంది సీనియర్ రెసిడెంట్లను గౌరవ వేతనం ఇచ్చే విధానంలో భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12న తగిన విద్యార్హత ధ్రువపత్రాలతో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని, దరఖాస్తుఫారాలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ ప్రకటన కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున్ సంయుక్తంగా జారీ చేశారు.
ఈ నెల 3న ‘సాక్షి’లో ప్రచురించిన కథనం


