శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత: డీఎస్పీ
ఖిల్లాఘనపురం: శాంతిభద్రతల పరిరక్షణ సమష్టి బాధ్యతని.. విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎస్‌ఐతో పాటు సిబ్బంది నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ అంటే భయపడేలా కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసేలా ఉ ండాలన్నారు. అందుకు స్టేషన్‌లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు. అదేవిధంగా సిబ్బందికి పలు సూచన లు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట ఎస్ ఐ వెంకటేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
అమరచింతకు
బస్సులు నడపండి
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రం నుంచి అమరచింతకు ఉదయం సమయంలో బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్లు చేసి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేయగా నమోదు చేసుకొని సమాధానం ఇచ్చారు. శ్రీరంగాపురం పుణ్య క్షేత్రానికి పెబ్బేరు మీదుగా, కేతేపల్లి, కల్వరాల మీదుగా వీపనగండ్లకు బస్సులు నడపాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత: డీఎస్పీ


