నూతనోత్సాహం..
● వాడవాడలా యువత, చిన్నారుల సందడి
● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు
ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2025 సంవత్సరం గడిచిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి పట్టణాల్లోని మిఠాయి దుకాణాలు, బేకరీలు, మద్యం దుకాణా వద్ద రద్దీ కనిపించింది. అర్ధరాత్రి 12 దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఇళ్లు, రహదారులపై కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. యువత ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం వేళ భక్తుల దర్శనార్థం గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, చర్చిలను ముస్తాబు చేశారు. – వనపర్తి టౌన్/ఆత్మకూర్


