
రెడ్ అలర్ట్
202 శాతం అధికంగా..
జిల్లాకు మూడురోజుల పాటు భారీ వర్షసూచన
అలుగుపారుతున్న గోపాల్‌దిన్నె రిజర్వాయర్
తేదీ నమోదైన
వర్షపాతం
3 0.1
6 1.8
7 7.4
8 42.6
9 36.7
10 7.0
11 18.2
12 36.4
13 8.9
వనపర్తి: జిల్లావ్యాప్తంగా రానున్న మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎల్లో అలర్ట్‌లో ఉన్న జిల్లాను బుధవారం సాయంత్రం వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరళాసాగర్, గోపల్‌దిన్నె రిజర్వాయర్లతో పాటు సుమారు 250 చెరువులు, కుంటలు సైతం నిండుకుండగా మారి అలుగు పారుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉకచెట్టువాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
వీపనగండ్లలో 23.4 మి.మీ. వర్షపాతం..
జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వీపనగండ్ల, శ్రీరంగాపురం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీపనగండ్ల మండలంలో 23.4 మి.మీ., శ్రీరంగాపురంలో 21.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లా సరాసరి వర్షపాతం 8.9 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క అమరచింత మినహా.. మిగతా అన్ని మండలాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ఎల్లో అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్‌లోకి మార్చిన
వాతావరణశాఖ
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లు
ఆత్మకూర్–మదనాపురం మధ్య నిలిచిన రాకపోకలు
250కిపైగా అలుగు పారుతున్న చెరువులు
వానాకాలం ప్రారంభం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవగా.. ఆగస్టులో ఇప్పటి వరకు సాధారణం కంటే 202 శాతం అధిక వర్షపాతం నమోదు కావటం గమనార్హం. మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూ రాల, భీమా ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీ టి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు.

రెడ్ అలర్ట్