
ప్రభుత్వ చీఫ్ విప్‌కు పతాకావిష్కరణ బాధ్యతలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ముఖఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. బుధవారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాలో ఎవరెవరు జెండా ఆవిష్కరణ చేయాలనే వివరాలతో ప్రత్యేకంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా నుంచి ఆయన పేరును ప్రకటించింది.
పోలీసుల తీరు
సరికాదు : బీజేపీ
వనపర్తిటౌన్: ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్‌చౌక్ వరకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నేతలు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్ అధ్యక్షతన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలతో నాయకులు కార్యకర్తలు శవయాత్ర నిర్వహించబోగా పోలీసులు అడ్డుకొని కార్యాలయానికి తాళం వేసి చెల్లాచెదురు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తే అడ్డుకోని పోలీస్ యంత్రాంగం, సీఎం శవయాత్రను ఆదిలోనే అడ్డుకోవడం ఏమిటని, ఇదేం వివక్ష అని మండిపడ్డారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కల రామన్‌గౌడ్, కోశాధికారి భాసెట్టి శ్రీను, మోర్చాల రాష్ట్ర నాయకులు కదిరె మధు, అలివేలమ్మ, మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ, అధికార ప్రతినిధి పెద్ది రాజు పాల్గొన్నారు.
ఓట్ల చోరీపై విస్తృత చర్చ జరగాలి : కాంగ్రెస్
వనపర్తిటౌన్: ప్రజాస్వామ్యానికి వెలుగునిచ్చే ఎన్నికల వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని, ఓ కుటుంబంలో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం ఆధారాలతో బయటపెడుతుంటే రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఎన్నికల సంఘం వ్యవస్థలో లోపాలు, పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎల్‌సీడీ స్క్రీన్‌పై అవగాహన కల్పించారు. పేపర్ బ్యాలెట్ విధానంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్య పాలనకు అడుగులు పడతాయన్నారు. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉదంతాలపై సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని అంబులెన్స్ వాహనాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఉంటే మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తప్పుపట్టడం సరైంది కాదన్నారు. గతంలో సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్ వాహనాలపై జాయన ఫొటోలు ముద్రించినప్పుడు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. డీసీసీ ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్‌మియా, పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సేవాదళ్ అధ్యక్షుడు జానకిరాములు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం వినోద్ పాల్గొన్నారు.
16న ఎస్‌జీఎఫ్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–15 బాల, బాలికల వాలీబాల్ ఎంపికలను స్థానిక మెయిన్ స్టేడియంలో ఈనెల 16న ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ కాపీలతో రిపోర్టు చేయాలని ఆమె కోరారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపికలకు రావాలని సూచించారు.

ప్రభుత్వ చీఫ్ విప్‌కు పతాకావిష్కరణ బాధ్యతలు