
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
పాన్‌గల్: రైతులు ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలని, ఇష్టానుసారంగా వాడితే నేల సారం దెబ్బతినడంతో పాటు డబ్బులు వృథా అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ రైతులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఈశ్వరయ్య సాగు చేసిన వరి పంటను అధికారులతో కలిసి పరిశీలించి ఎరువుల వినియోగం, తెగుళ్లు ఆశిస్తే వాడాల్సిన పురుగు మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియాను అవసరం మేరకు వాడాలని, ఎక్కువ మోతాదులో వినియోగించొద్దని సూచించారు. ఆయన వెంట ఏడీఏ తిప్పేస్వామి, ఇన్‌చార్జ్ ఏఓ డాకేశ్వర్‌గౌడ్, సిబ్బంది ఉన్నారు.