
ఆ ఊళ్లో 2 కుటుంబాలే..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం పాత బండరాయిపాకులలో గతంలో 480 కుటుంబాలు నివసించేవి. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉండగా.. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుండగా.. 2021లో ప్రజలను ఖాళీ చేయించారు. పునరవాసం కింద కొత్తగా నిర్మించిన బండరాయిపాకులకు తరలించారు. అందరూ వెళ్లగా ప్రస్తుతం పాత గ్రామంలో రెండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అన్నాదమ్ములైన మిద్దె పెద్ద లక్ష్మయ్య (మృతుడు హరిబాబు తండ్రి), మిద్దె చిన్న లక్ష్మయ్య కుటుంబాలు పక్కపక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఊరంతా నిర్మానుష్యం కాగా.. ప్రస్తుతం అడవిలా తయారైన ఈ పాత ఊళ్లో దొరికే ఆకులు, అలుములతోనే ఆ రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి.

ఆ ఊళ్లో 2 కుటుంబాలే..