సాగు ప్రణాళిక సిద్ధం
2025–26 వానాకాలంలో జిల్లాలో పెరగనున్న వరి, పత్తి సాగు విస్తీర్ణం
వరి సాగే అధికం..
మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు అధికంగా వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ, అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఎలాంటి వరి వంగడాలు వినియోగించాలో రైతులకు వివరిస్తున్నాం.
– అరవింద్, ఏఓ, అమరచింత
ప్రణాళికతో ముందుకు..
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వాటి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పత్తి, చెరుకు, కంది సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. వానాకాలం సాగుకు ఎంత మేర విత్తనాలు, ఎరువులు అవసరమనే వివరాలను ఏఓలతో సేకరించి సాగుకు ముందే నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– దామోదర్, ఏడీఏ, కొత్తకోట
అమరచింత: జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు వేసవి దుక్కులు దున్నుతూ.. రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారి దిశా నిర్ధేశంతో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 2.48 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. ఈసారి 2,55,324 ఎకరాలకు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రైతుల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంబంధితశాఖ అధికారులు వెళ్లి పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
పంట విస్తీర్ణం
(ఎకరాల్లో..)
వరి 2,05,570
జొన్న 2,020
పత్తి 15,303
మొక్కజొన్న 9,474
వేరుశనగ 8,266
కంది 7,111
మిర్చి 2,115
చెరుకు 1,356
మినుములు 1,082
ఆముదం 414
వరి, పత్తి సాగుకే ప్రాధాన్యం..
జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వానాకాలంలో రైతులు అత్యధికంగా వరికే ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని గ్రామాల్లో వర్షాధారంతో పత్తి సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే తమ పొలాలను చదును చేసి ఉంచారు. జూరాల ఎడమ కాల్వతో పాటు ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో వరి సాగు అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించడంతో వాటి సాగుపై దృష్టి సారిస్తున్నారు.
రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు
విత్తేందుకు అనువు
2,05,570 ఎకరాల్లో
వరి సాగు అంచనా
మొత్తం పంటల సాగు విస్తీర్ణం
2,55,324 ఎకరాలు
రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాలు..
సాగునీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలి.. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ఏయే పంటలు సాగు చేయాలనే విషయాలపై రైతువేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలు, జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ఎలాంటి వరి వంగడాలను ఎంపికచేసుకోవాలనే విషయాలను వివరిస్తున్నారు. వీటికితోడు ఎరువులు ఏ సమయంలో ఎంత మొత్తం వినియోగించాలి, రసాయన మందులను ఎలా పిచికారీ చేయాలనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు. వేసవిలో భూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలకు హాని కలిగించే కారకాలను నిర్మూలించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
సాగు ప్రణాళిక సిద్ధం
సాగు ప్రణాళిక సిద్ధం
సాగు ప్రణాళిక సిద్ధం


