పాలకొండ రూరల్: మండలంలోని తంపటాపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఇప్పిలి శివ,, బి.మహేంద్ర అండర్–17 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 7వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వీరు ఈనెల 13 నుంచి 15 మధ్య అంబేడ్కర్ కోససీమ జిల్లాలో జరగనున్న పోటీల్లో తలపడనున్నారు. ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం టి.పద్మావతి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న వ్యాయామోపాధ్యాయులు మజ్జి రామకృష్ణ, సహ ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని అభినందించారు.


