అంతర్జాతీయ స్థాయికి దేవహర్ష | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయికి దేవహర్ష

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

● 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ

గజపతినగరం: ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న స్థానికుడైన జె.వెంకట దేవ హర్ష ఇటీవల మహరాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన 3000మీటర్ల పరుగు పందెంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ మేరకు విజయనగరం మోడ్రన్‌ పెంట్లాథాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.శేఖర్‌ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాల నుంచి దేవహర్ష అనేక రాష్ట్రస్థాయి మెడల్స్‌ సాధిస్తూ హర్ష మంచి ప్రతిభ కనబరుస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హర్షను పెంట్లాథాన్‌ సెక్రటరి ఎన్‌.సూర్య, ట్రెజరర్‌ జె.సతీష్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement