అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో భద్రం స్వల్ప సంఘటనలు మినహా అంతా ప్రశాంతం రేపు కౌంటింగ్‌లో తేలనున్న ఫలితం అప్పుడే మొదలైన బెట్టింగులు
శాతం ఓటింగ్
65.33
జిల్లాలో
మున్సిపల్ పోలింగ్ శాతంఇలా..
స్ట్రాంగ్
రూములకు బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ ముగిసింది..
వీల్ చైర్‌లేక
52వ వార్డు
పరిధిలోని సెయింట్ ఆన్స్ గర్ల్స్
హైస్కూల్‌లో
పోలింగ్ కేంద్రానికి
వృద్ధురాలిని ఎత్తుకుని తీసుకెళ్తున్న
బంధువు
ఎం.ఆర్.కాలేజీలో నెలల బిడ్డను తీసుకుని వచ్చి ఓటు వేస్తున్న మహిళ
ఎం.ఆర్.కళాశాలలో ఓటు వేస్తున్న శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు స్వల్ప వివాదాలు, తోపులాటల మధ్య ముగిశాయి. విజయనగరం కార్పొరేషన్, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి మున్సిపాలిటీలు, పాలకొండ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. అనంతరం అభ్యర్థుల భవిత వ్యాన్ని సీల్డ్ బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఇలా రేపటి వరకు అభ్యర్థులకు, కార్యకర్తలకు టెన్షన్ టెన్షన్ తప్పదు. గత పదిహేను రోజులుగా రాజకీయ పార్టీల కోసం పని చేసిన కార్యకర్తలు.. అభ్యర్థులు మెల్లగా ఇళ్లకు చేరుకొని తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాం.. అయ్యో.. ఇంకాస్త పంచితే గెలిచేవాళ్లం కదా బాధపడేవాళ్లు కొందరు.. అయ్యో ఇంత సర్వీస్ చేసినా జనం అభిమానం పొందలేకపోయామే అని ఫీలైనవాళ్లు మరికొందరు.. మొత్తానికి గెలిచేస్తున్నాం గురూ అంటూ కాన్ఫిడెన్స్‌తో రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్లేవారు కొందరు.. మొత్తనికి రెండు వారాల నుంచి సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.
ఎన్నికలు ముగిసిన తరువాత ట్రెండ్స్ బట్టి ఎవరి అంచనాల్లో వారు పడిపోయారు. ఎవరి కాన్ఫిడెనన్స్ వాళ్లకు ఉండడంతో ఇప్పటికే బెట్టింగ్ బంగార్రాజు లు లైన్లోకి వచ్చేశారు. వార్డుల వారీగా ఎవరు గెలుస్తారనేదానిపైనా బెట్టింగులు మొదలయ్యాయి. ఏ పార్టీకి ఎన్ని కార్పొరేటర్ స్థానాలు వస్తాయనేదానిమీద కూడా బెట్టింగ్ నడుస్తోంది. కొందరు మేయర్ ఎవరు అవుతారన్నదానిమీద బెట్టింగ్ వేస్తున్నారు.
విజయనగరం కార్పొరేషన్‌లోని 56వ డివిజన్ కణపాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనిమెరక తౌడు ను బీజేపీ కార్యకర్త చింతపల్లి అప్పారావు బెదిరించారు. అయ్యన్నపేటలోని మేధాస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ 56/1,2 వద్ద బీజేపీ కార్యకర్త ఒక్కసారిగా తౌడు మీద దాడికి యత్నించి బెదిరించారు. నిన్ను రేపటికి లేకుండా చేస్తాను అని బెదిరించడం కలకలం రేపింది. ప్రశాంతమైన పట్టణంలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
●58, 60 డివిజన్ల కు సంబంధించి గాజులరేగ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ వార్డు ఇన్ చార్జి గార సత్యనారాయణ ఓటేసేందుకు క్యూలో నిలబడగా టీడీపీ నాయకుడు కర్రోతు శంకర్, పిల్లి శ్రీను ఆయనను బయటకు లాగేసి నీకు ఇక్కడేం పని అని బెదిరించి కొట్టారు. వాస్తవానికి 58, 60 వార్డులకు సంబంధించి ఒకే చోట పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో అయన అక్కడికి ఓటేసేందుకు వచ్చారు. అయితే, ఆయన స్థానికేతరుడు అని భావించి టీడీపీ నేతలు తనమీద మీద దాడిచేసి కొట్టినట్లు సత్యనారాయణ తెలిపారు.
విజయనగరం అర్బన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం తొలి గంటల్లో మందకొడిగా సాగిన పోలింగ్... సమ యం గడిచే కొద్దీ పుంజుకుంది. నెల్లిమర్ల నగర పంచాయతీగా మారిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అక్కడ అత్యధికంగా 80.31 శాతం పోలింగ్ నమోదైంది. మూడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండడం విశేషం.
మహిళా ఓటర్లే అధికం
విజయనగరం కార్పొరేషన్‌లో 1,39,911 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 67,050 మంది పురుషులు, 72,851 మంది మహిళలు, 10 మంది ఇతరులు ఉన్నారు. నెల్లిమర్లలో మొత్తం 15,320 మంది ఓటు వేయగా... వీరిలో 7,264 మంది పురుషులు, 8,055 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. బొబ్బిలిలో 335,141 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 16,763 మంది పురుషులు, 18,373 మంది మహిళలు, ఐదుగురు ఇతరులు ఉన్నారు.
కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ పర్యవేక్షణ
ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచే నిరంతరం పర్యవేక్షించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల పరిస్థితులను పరిశీలిస్తూ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని యాప్‌లో అప్‌లోడ్ చేయించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేసి పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించారు. విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి రాజీవ్ స్టేడియం, నెల్లిమర్ల నగర పంచాయతీ బూత్‌లను సీకేఎం జూనియర్ కళాశాల, బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించిన బూత్‌లను గ్రోత్ సెంటర్‌లోని ఏపీఐఐసీ భవనంలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు తరలించేందుకు వినియోగించిన 82 వాహనాల్లోనే బ్యాలెట్ బాక్సులను తిరిగి తరలించారు.


