కొనిశలో 30 కుటుంబాలు..
గజపతినగరం రూరల్: మండలంలోని కొనిశ గ్రామంలో టీడీపీ వీడి 30 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. కొనిశ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమలి దిలీప్, పాసల సత్యారావు, వేమలి అప్పారావు, కృష్ణల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పల నరసయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి చోట చేరికల పరంపర కొనసాగుతోందన్నారు. అధికార కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పల్లి సంజీవరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కో ఆర్డినేటర్ బూడి వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఉంగరాడలో
50 కుటుంబాలు..
రేగిడి: మండల పరిధిలోని ఉంగరాడ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరాయి. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, ఉంగరాడ ఎంపీటీసీ అభ్యర్థి పిల్లా రోజా, యూత్ నాయకులు పొట్నూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుంకర ఎరుకునాయుడు, బంకి అప్పలనాయుడు, బంకి పోలినాయుడు, ముద్దాడ తవుడు, సుంకర శ్రీనివాసరావు, విద్యాకమిటీ మాజీ చైర్మన్ కరణం సూరపునాయుడు, వియ్యపు ఎరకయ్య, చౌదరి ఎరుకునాయుడు తదితరులకు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో ప్రజలు ఉర్రుతలూగుతున్నారని అన్నారు. ఏ గ్రామంలో చూసినా వైఎస్సార్‌సీపీకి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుంధుబి మోగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ముంజేటి కిషోర్‌కుమార్, విజయ్యపు చక్రపాణి, పిల్లా గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొండకిండాంలో 20 కుటుంబాలు
బొండపల్లి: కూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని కొండకిండాం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ముంజేటి కన్నం నాయుడుతో పాటు 20 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో పార్టీని వీడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణ పాఠం ఆ పార్టీకి చెబుతారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పాలూరి గణేష్, మూడడ్ల రాంబాబు, పేట కల్యాణ్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొద్దల చిన్నం నాయుడు, భోపారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పెదమానాపురంలో 45 కటుంబాల చేరిక
దత్తిరాజేరు: మండలంలోని పెదమానారంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఈ మేరకు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రౌతు రాజేశ్వరి తరఫున ప్రచారానికి ఆదివారం వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సంక్షంలో 45 కటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. పిలక కామయ్య, బోర రామచంద్ర ఆదినారాయణ, బోర రవి, పిలక సంతోష్ ,శ్రీను, పొంగ ఈశ్వరరావు, గొటివాడ జోజి, గొటివాడ దీలీప్, నగిరెడ్ల రమణ తదితర కుటుంబాల వారు పార్టీలో చేరడంతో వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్‌సీసీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా అన్నారు.
లక్కవరపు కోటలో
30 కుటుంబాలు..
లక్కవరపుకోట: మండలంలోని కోనమసివానిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎంపీటీసీ బొడ్డు గణపతి ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ బొడ్డు గణపతి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి బోకం భార్గవి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సైకిల్ టైర్లకు గాలి లీకవుతోంది. చైన్ తప్పిపోతోంది. హ్యాండిల్ వంకర పోయింది. బెల్లు మోగడం లేదు. రిమ్ములు పింపిరి పడుతున్నాయి. మొత్తంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బీటలు వారుతున్నాయి. రోజురోజుకూ ఆ పార్టీకి బలం తగ్గిపోతోంది. ఆ పార్టీని వీడుతున్న వారంతా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీలో టీడీపీ వారి చేరికల పరంపర కొనసాగుతుండడంతో పార్టీ బలపడుతోంది. ఆదివారం జిల్లాలో వైఎస్సార్‌సీపీలో జరిగిన చేరికల వివరాలిలా ఉన్నాయి.


