విజయనగరం గంటస్తంభం: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం విజయనగరానికి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను తీవ్ర రూపం దాల్చి, నెల్లూరు–నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపా ను ప్రభావంతో విజయనగరం జిల్లాలో 3వ తేదీ మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లేదా వాట్సాప్ మిత్ర నంబర్ 9552300009ను సంప్రదించాలని కోరారు.
విజయనగరం రూరల్: ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది..? దాడులతో నెగ్గుకువద్దామన్న అధికా ర పార్టీ తీరుపై శాసనమండలి విపక్ష నేత బొ త్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మితో కలిసి విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కావడం లేదని, ప్రజాస్వామ్యబద్దంగా జరగడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. ఎంతసేపు ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విద్య ప్రాథమిక హక్కు అని, గత ప్రభు త్వం అనేక పాఠశాలలను నిర్మించిందని, అయి తే ఎన్నికల సమయానికి కొన్ని అసంపూర్తి పనులు మిగిలిపోతే ఇప్పటికీ వాటిని పూర్తిచేయక విద్యార్థులకు విద్యను దూరం చేసిందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పట్టంకడతారని ఆశాభావం వ్యక్తంచేశారు.


