కూటమి కుట్రలు బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు బట్టబయలు

Oct 26 2026 7:18 AM | Updated on Oct 26 2026 7:18 AM

కూటమి కుట్రలు బట్టబయలు ●దత్తత వల్ల పుట్టుకతో వచ్చిన కులం మారదు

ఓసీ మహిళకు దొంగ బీసీ సర్టిఫికెట్‌

జైన్‌ మహిళకు బీసీ–డీ ముసుగు

బొత్స చైతన్య నామినేషన్‌ తిరస్కరణ వెనుక కూటమి కుట్రలు

రిజర్వేషన్ల దోపిడీకి టీడీపీ సరికొత్త

ఎత్తుగడ.. దత్తత పేరిట అక్రమ సర్టిఫికెట్‌

ముస్కాన్‌ జైన్‌.. సిరి సహస్ర ఎలా అయ్యారు?

సిరి సహస్ర కుల ధ్రువీకరణపై కలెక్టరేట్‌ లో ఆధారాలతో వైఎస్సార్‌సీపీ పోరుబాట

చర్యలు తీసుకోకపోతే హైకోర్టును

ఆశ్రయిస్తాం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుల ప్రకారం ఒక వ్యక్తి ఎవరికై నా దత్తత వెళ్లినంత మాత్రాన పు ట్టుకతో వచ్చిన మూల కులం మారదు. రిజర్వేషన్‌ ప్రయోజనాలు వర్తించవు. ముస్కాన్‌ జైన్‌ ఉన్నత సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన మహిళ, ఆమె ఎలాంటి సామాజిక వివక్షలను అనుభవించలేదు. తల్లిదండ్రుల పేర్లు మారినంత మాత్రాన రాజ్యాంగబద్ధమై న బీసీ రిజర్వేషన్‌ ఎలా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రా ష్ట్ర బీసీల జాబితాలో జైన్‌ కమ్యూనిటీ ఎక్కడా లేదు. బీసీ లిస్టులోనే లేని కమ్యూనిటీకి చెందిన మహిళకు స్థానిక తహసీల్దార్‌ ఏ ప్రాతిపదికన బీసీ–డీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశారో రికార్డులు బయటపెట్టాలి. నిజమైన బీసీ మహిళలకు దక్కాల్సిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – బెల్లాన రవి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు

విజయనగరం గంటస్తంభం:

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతల పక్షపాత వైఖరి, అధికారుల ద్వంద్వ ప్రమాణాలు పతాకస్థాయికి చేరాయి. పూసపాటిరేగ జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స చైత న్య నామినేషన్‌ను చిన్నచిన్న కారణాలు చూపి కుట్రపూరితంగా తిరస్కరించిన అధికారులు, మరోవైపు కొత్తవలస జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ తరఫున ఒక ఓసీ మహిళ దొంగ కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్‌ వేసినా కళ్లు మూసుకుని ఆమోదించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరికి ఒక న్యాయం, అధికా ర పార్టీ నేతల అక్రమాలకు మరో న్యాయమా? అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

కొత్తవలస జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన సిరి సహస్ర అసలు పేరు ము స్కాన్‌ జైన్‌ అని, ఆమె తండ్రి రమేశ్‌కుమార్‌ జైన్‌ అని వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధారాలను బయటపెట్టింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన జైన్‌ కులంలో పుట్టిన మహిళకు దత్తత పేరిట బీసీ–డీ(తూర్పు కాపు) సర్టిఫికెట్‌ ఇప్పించి, బీసీ రిజర్వేషన్‌ సీటును కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని ఆధారాలతో సహా నిరూపించింది. ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సిహెచ్‌.సత్తిబాబుకు వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బెల్లాన రవి తో కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతర ప్రతాలు, గెజిట్‌ నోటిఫికేషన్లు, పదో తరగతి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ అంశంపై కలెక్టర్‌ తీసుకునే చర్యలను బట్టి తదుపరి న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement