మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణిని, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న 62 మంది డివిజన్ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు కార్పొరేట్ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– విజయనగరం


