మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూకుడు పెంచారు. బొబ్బిలి మున్సిపల్ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు వెంట రాగా వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని పాత బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకటో వార్డు అభ్యర్థి చోడిగంజి రమేష్‌నాయుడు, రెండో వార్డు అభ్యర్థి కాగాన హైమావతి, మూడో వార్డు అభ్యర్థి బండి అప్పలకొండతో కలిసి ప్రచారం నిర్వహించారు. వారి వెంట మాజీ కౌన్సిలర్ కోట పెదరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో వీరికి ప్రజలు సాదర స్వాగతం పలికి ఆశీర్వదించారు. – బొబ్బిలి


