రాజాం : మండలంలో బొద్దాం గ్రామానికి చెందిన మాజీ గ్రామ వలంటీర్ నక్క పార్వతి స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గ్రామ వాలంటీర్‌గా ఆమె గ్రామంలో ప్రజలకు విశేష సేవలు అందించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం వలంటీర్ వ్యవస్థ రద్దవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో బొద్దాం గ్రామ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సెగ్మెంట్‌కు బరిలో నిలిచి ప్రచారం చేస్తున్నారు. ఎంపీటీసీగా తాను గెలిచి జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.


