కొత్తవలస:
వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబునాయుడు... రిజర్వేషన్ల పేరుతో బీసీ కులస్తులను నమ్మించి మరోమారు వెన్నుపోటు పొడిచారని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొత్తవలస మండలంలోని ఏజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో పార్టీ మండలాధ్యక్షుడు ఒబ్బిన సత్యనారాయణ అధ్యక్షతన, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మండల విస్తృస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. హైకోర్టు కొట్టివేసిన రిజర్వేషన్ల జీఓలపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ ఇంకా జననాన్ని నమ్మించడం హాస్యాస్పదమన్నారు. వెన్నుపోటు పోడిచిన వారే వెన్నుపోటు పార్టీలో చేరారని, అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, చంద్రబాబు మాటలు జనానికి నవ్వుతెప్పిస్తున్నాయన్నారు. చంద్రబాబు తపస్సుచేసి దండం పెడితే విశాఖపట్నంలో వర్షం పడిందంటూ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. స్థానిక ఎన్నికలు అంటే చంద్రబాబుకు భయమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనునిత్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. రెండున్న సంవత్సరాల్లో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదని, స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ డ్రామా మొదలు పెట్టిందన్నారు.
● అండగా ఉంటాం..
నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్.కోట నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగనన్నకు కార్యకర్తలే బలమని, ఆ ఉద్దేశంతోనే గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇచ్చారన్నారు. గుర్తుంపు కార్డున్న ప్రతీ ఒక్కరికి ప్రమాద బీమా రూ.5లక్షలు పార్టీ చెల్లిస్తుందన్నారు. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
● మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్.కోట నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి వివిధ కమిటీల్లో ఉన్న 7వేల మందికి గుర్తింపు కార్డులు అందజేసినట్లు తెలిపారు. బీసీలను కూటమి ప్రభుత్వం మరోమారు మోసం చేసిందన్నారు.
● మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి మూడు పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. అనంతరం పార్టీ పరిశీలకురాలు కె.భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు తదితరులు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నీలంశెట్టి గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీలు మూకల కస్తూరి, తూర్పాటి వరలక్ష్మి, పార్టీ నాయుకులు బొంతల వెంకటరావు, పల్లా భీష్మ, బూసాల దేముడు, మదీన అప్పలరాం, బోదల సురేష్, అమ్మా శ్రీనివాస్, అప్పారావు, వేపాడ మండల పార్టీ అధ్యక్షుడు ముమ్మలూరి జగ్గుబాబు, సింగంపల్లి గణేష్, జామి ఈశ్వరరావు, సంతపాలెం వెంకటరమణ, పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
నమ్మించడం, మోసం చేయడం
చంద్రబాబుకు అలవాటు
బాబు తపస్సు, దండాల వల్ల విశాఖలో వర్షం కురిసిందట..
రాష్ట్రంలో గాడితప్పిన పాలన
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి
పిలుపునిచ్చిన శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
జగనన్నకు కార్యకర్తలే బలం: మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు


